ఇంటిలో నగలు చోరీ చేసి కులాసాగా ట్రావెల్ వీడియోలు.. అవే వీడియోలతో పోలీసులకు దొరికిపోయాడు..
న్యూఢిల్లీలోని ఒక ఇంట్లో దొంగతనం చేసి దర్జాగా తిరిగాడు.. తీరా అతడు చేసిన ట్రావెల్ వీడియోలతో సులభంగా పోలీసులకు చిక్కాడు.బిందాపూర్‌కు చెందిన సంజీవ్ (29) జూలై 11న న్యూఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన ఒక నెల తర్వాత,
అతని ట్రావెల్ వ్లాగ్‌ల ద్వారా పోలీసులు అతడు ఉన్న చోటును ట్రాక్ చేశారు. ఆగ్రాలో ఉండగా దొంగను అరెస్టు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. అంతకుముందు తన ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఇంటి యజమాని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.విచారణలో భాగంగా పోలీసులు సమీపంలోని ప్రదేశాలలోని సీసీ టీవీ ఫుటేజీని విశ్లేషించారు .. నిందితుడు సంజీవ్ చోరీ చేసిన ఇంటి నుండి బయటకు వెళ్లడం కనిపించింది. అతడి చివరి ప్రదేశం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్నట్టు గుర్తించారు. అతడిని ఎవరూ గుర్తించకుండా ఉండటానికి అతను తన మొబైల్ ...