జనరల్ క్లాస్ రైలు ప్రయాణికులకు శుభవార్త: కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 10 జనరల్ కోచ్‌లు
Indian Railways introducing New Amrit Bharat Express | భారతీయ రైల్వే 12,000 కంటే ఎక్కువ రైళ్లతో ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. అయితే కొన్నేళ్లుగా దేశంలోని అన్ని రైల్వేస్టేషన్ల (railway stations)ను ఆధునికీకరించడమే కాకుండా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. మరోవైపు కొత్త రైళ్లను కూడా ప్రవేశపెడుతోంది. గత 10 సంవత్సరాలలో వందే భారత్, తేజస్, హమ్‌సఫర్, అమృత్ భారత్ వంటి అనేక రైళ్లు పట్టాలెక్కాయి. అయితే ఇండియన్ రైల్వే ఇప్పుడు పేద మధ్యతరగతి ప్రయాణికుల కోసం ఎక్కువ దూరం కూర్చొని సౌకర్యవంతమైన ప్రయాణం అందించే రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.ఎక్స్ ప్రెస్ రైళ్లలో 10 స్లీపర్ , 10 జనరల్ కోచ్‌లు10 నెలల పాటు అమృత్ భారత్ రైళ్లను ప్యాసింజర్ ఆపరేషన్లలో విజయవంతంగా పరీక్షించిన తర్వాత, మరో 50 రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు...