138 జంటల విడాకులను అడ్డుకున్న న్యాయవాది.కానీ, ఆయనకే విడాకులు ఇచ్చిన భార్య..!
ఆయన ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ సీనియర్ న్యాయవాది. తన 16 ఏళ్ల న్యాయవాద వృత్తిలో విడాకుల కోసం వచ్చిన జంటలకు నచ్చజెప్పి కలిసి జీవించేలా చేశారు. కానీ, విచిత్రంగా ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఆర్థిక పరిస్థితులు ఆయన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ హైకోర్టులో ఓ వ్యక్తి 16 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తన వృత్తిలో భాగంగా 138 జంటలు విడాకులు తీసుకోకుండా అడ్డుకున్నారు.
విడాకుల కేసు వేసిన భార్య
సదరు న్యాయవాది భార్య తనకు విడాకులు కావాలంటూ కేసు ఫైల్ చేసింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కారణాలు పేర్కొంది. విడాకుల కోసం వచ్చే జంటలను విడిపోకుండా ఆపడమేకాకుండా ఎలాంటి ఫీజులు తీసుకోవడంలేదని వివరించింది. ఏమాత్రం ఫీజులు తీసుకోకపోవడంతో ఉచితంగా న్యాయసేవలు అందించడంతో ఆ...