Samvidhaan Hatya Diwas | కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై ఏటా జూన్ 25న ‘సంవిధాన్ హత్యా దివస్’
New Delhi | 1975లో అప్పటి ప్రధాన మంత్రి మంత్రి ఇందిరా గాంధీ విధించిన 'ఎమర్జెన్సీ' కారణంగా అనేక కష్టాలు అనుభవించిన వారందరి కోసం ఏటా జూన్ 25 న 'సంవిధాన్ హత్యా దివస్ ( Samvidhaan Hatya Diwas)'గా జరుపుకోవాలని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా నిర్ణయించింది.
"జూన్ 25, 1975న, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, తన నియంతృత్వ ధోరణితో దేశంలో ఎమర్జెన్సీని విధించి భారత ప్రజాస్వామ్యం ఆత్మను ఉక్కిరిబిక్కిరి చేసారు" అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్(X)లో రాశారు. “భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 25ని 'సంవిధాన్ హత్యా దివస్'గా జరుపుకోవాలని నిర్ణయించింది. 1975 ఎమర్జెన్సీ కాలంలో ప్రజల అమానవీయ బాధను, సహకారాన్ని ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది, ”అన్నారాయన. ఏ తప్పు లేకుండా లక్షలాది మందిని కటకటాల వెనక్కి నెట్టారని, మీడియా గొంతు నొక్కారని అమిత్ షా అన్నారు. 'సంవిధాన్ హత్యా దివస్' పాటించడం...