Thursday, December 26Thank you for visiting

Tag: Nampalli

South Central Railway | ప్రయాణికులకు అలెర్ట్..  సికింద్రాబాద్ పరిధిలో పలు రైళ్లు రద్దు..

South Central Railway | ప్రయాణికులకు అలెర్ట్.. సికింద్రాబాద్ పరిధిలో పలు రైళ్లు రద్దు..

Telangana
South Central Railway Updates | హైదరాబాద్‌, సికింద్రాబాద్‌(Hyderabad, Secunderabad) డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా సెప్టెంబర్‌ 1నుంచి 30 వరకు సికింద్రాబాద్‌-వరంగల్‌ మెమూ 07462) రైలు రద్దు చేశారు. అలాగే వరంగల్‌-హైదరాబాద్‌ మెము రైలు (07463), కాజీపేట-బల్లార్షా (17035) రైళ్లు రద్దయయ్యాయి.ఇక సెప్టెంబర్‌ 2నుంచి అక్టోబర్‌ 1వరకు బల్లార్షా-కాజీపేట (17036), సెప్టెంబర్‌ 1నుంచి 30వరకు సిర్పూర్‌టౌన్‌-కరీంనగర్‌ ఎంఈఎంయూ (07766), కరీంనగర్‌-బోధన్‌ ఎంఈఎంయూ(Karimnagar-Bodhan MEMU)(07894), నవంబర్‌ 2నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు బోధన్‌-కరీంనగర్‌ మెము (07893), కరీంనగర్‌-సిర్పూర్‌ టౌన్‌ (07765) రద్దు అయ్యాయి. అలాగే  నవంబర్‌1నుంచి 30 వరకు కాచిగూడ-నడికుడి(07791), నడికుడి-కాచిగూడ (07792) రైళ్లను రద్దు చ...
Cherlapalli | చివరి దశకు చర్లపల్లి రైల్వే టెర్మినాల్ పనులు

Cherlapalli | చివరి దశకు చర్లపల్లి రైల్వే టెర్మినాల్ పనులు

Telangana
Cherlapalli | హైదరాబాద్: రూ.430 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తున్న చర్లపల్లి రైల్వేస్టేషన్‌ పునరుద్ధరణ పనులు చివరి దశలో ఉన్నాయని, మరికొన్ని వారాల్లో పనులు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌ అధికారులు తెలిపారు.పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని కొన్ని రోజుల క్రితం ఉన్నతాధికారులు రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదించారు.  హైదరాబాద్‌కు తూర్పు వైపున ఉన్న రైల్వే టెర్మినల్‌ను అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ స్టేషన్ పూర్తయిన తర్వాత 15 అదనపు రైలు సర్వీసులను నిర్వహించగలదని అధికారులు తెలిపారు. ఇది 10 అదనపు లైన్లను నిర్మించారు.. అంతేకాకుండా, రీడెవలప్‌మెంట్ స్టేషన్‌లో నాలుగు అదనపు హై-లెవల్ ప్లాట్‌ఫారమ్‌లు ఉంటాయి, ప్రస్తుతం ఉన్న ఐదు ప్లాట్‌ఫారమ్‌లు కూడా పూర్తి-నిడివి గల రైళ్లను నిలపడానికి వీలుగా విస్తరించారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ...
Cherlapalli Railway Terminal | హైద‌రాబాద్‌లో సిద్ధ‌మ‌వుతున్న‌ చర్లపల్లి రైల్వే టెర్మినల్.. త్వ‌ర‌లోనే ప్రారంభం..

Cherlapalli Railway Terminal | హైద‌రాబాద్‌లో సిద్ధ‌మ‌వుతున్న‌ చర్లపల్లి రైల్వే టెర్మినల్.. త్వ‌ర‌లోనే ప్రారంభం..

Telangana
Cherlapalli Railway Terminal | హైదరాబాద్ నగర శివారులోని చెర్లపల్లిలో ప్ర‌యాణికుల కోసం కొత్త టెర్మినల్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి, ఈ నెలలోనే ప్రారంభోత్సవానికి సిద్ధ‌మ‌వుతోంది. విమానాశ్రయాల త‌ర‌హాలో అత్యంత ఆధునిక సౌకర్యాల‌తో లేటెస్ట్ డిజైన్ రూపుదిద్దుకుంటోంది. ఈ చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్ సుమారు రూ. 430 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇక రైళ్ల ఆలస్యానికి త్వరలో చెక్ పడనుంది.రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర ప‌రిధిలో ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల‌కు నిత్యం భారీ సంఖ్య‌లో వ‌చ్చిపోయే ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోతుంటాయి. అయితే చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్ అందుబాటులోకి వ‌స్తే ఆయా స్టేష‌న్ల‌పై భారం త‌గ్గిపోతుంది. అనేక రైళ్లు చెర్లపల్లి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ‌ టెర్మినల్స్ వద్ద ...
Cherlapally Railway Terminal | త్వరలో అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్‌.. ఇక్కడి నుంచే 25 రైళ్ల రాకపోకలు

Cherlapally Railway Terminal | త్వరలో అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్‌.. ఇక్కడి నుంచే 25 రైళ్ల రాకపోకలు

Telangana
Cherlapally Railway Terminal |  ప్రయాణికులకు శుభవార్త.. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.  ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ లో  కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్‌సిటీ రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం ఉంది. అయితే  రైల్వే టర్మినల్  అందుబాటులోకి వచ్చాక సుమారు 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే కార్యాచరణను రూపొందంచింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే కొన్ని ట్రైన్స్ ను చర్లపల్లి టెర్మినల్కు మార్చే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆరు లైన్లతో అత్యాధునిక స్టేషన్ అయితే లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత చర్పలల్లి టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. రైల్వేశాఖ సుమారు రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణ...