Indian Railways | నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో 20 కోచ్ లు, 1,440 సీట్లు
Nagpur-Secunderabad Vande Bharat Schedule | తెలుగు రాష్ట్రాలకు రేపు రెండు కొత్త వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే..ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న సోమావరం వీడియో రిమోట్ లింక్ ద్వారా నాగ్‌పుర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్, తోపాటు భుజ్-విశాఖపట్నం వందేభారత్ రైళ్లను ప్రారంభించున్నారు. అయితే నాగ్ పూర్ - సికింద్రాబాద్ రైలులో మొత్తం 20 కోచ్ లు, 1,440 సీట్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మహారాష్ట్రకు తెలంగాణకు కనెక్ట్ చేసే తొలి తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇది. గతంలో తీసుకువచ్చిన సికింద్రాబాద్- బెంగళూరు వందేభారత్‌లో 8 కోచ్‌లు ఉన్నాయి. విశాఖపట్నం, తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో 16 కోచ్ లు ఉండగా, నాగ్‌పుర్-సికింద్రాబాద్ వందే భారత్‌లో 20 కోచ్‌లు ఉంటాయని.. దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడుస్తున్న వందేభ...