Jabalpur | తండ్రి, సోదరుడిని చంపిన 15 ఏళ్ల బాలిక.. శరీరాలను ముక్కలు చేసి ఫ్రీజర్‌లో..
Minor girl kills father : మధ్యప్రదేశ్ లో ఊహించని దారుణమైన ఘటన చోటుచేసుకుంది. గత మార్చి 15న జబల్‌పూర్ (Jabalpur) లోని మిలీనియం సొసైటీలో తన తండ్రి, తొమ్మిదేళ్ల సోదరుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 ఏళ్ల బాలికను పోలీసులు అరెస్టు చేశారు. అయితే జంట హత్యలు చేసిన అనంతరం తండ్రి, తమ్ముడి మృతదేహాలను ముక్కలుగా చేసి ఫ్రీజర్‌లో భద్రపరచడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.పదో తరగతి చదువుతున్నఈ టీనేజ్ బాలిక పోలీసులకు పట్టుబడటానికి ముందు రెండు నెలలకు పైగా పరారీలో ఉంది. సదరు బాలిక 19 ఏళ్ల ముకుల్ సింగ్ ను ఇష్టపడింది. అయితే వీరి సంబంధాన్ని రైల్వే హెడ్ క్లర్క్ అయిన తన తండ్రి రాజ్‌కుమార్ అంగీకరించలేదు. దీంతో సెప్టెంబరులో బాలిక ముకుల్‌తో కలిసి పారిపోయింది. పోలీసులు వెంటనే ముకుల్ ను పోక్సో చట్టం (POCSO Act) కింద అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఇద్దరూ కలిసి ఆమె త...