temple vandalised | హైదరాబాద్‌లో మరో ఆలయంలో విగ్రహం ధ్వంసం
Moinabad temple vandalised | మొయినాబాద్‌లో శనివారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హనుమాన్ ఆలయాన్ని (Hanuman Temple) అపవిత్రం చేసి హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌లోని తుల్‌కట్ట గేటు వద్ద ఉన్న ఆలయ ప్రాంగణంలోకి అగంతకులు ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.ఆదివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీల్ చేశారు. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను గుర్తించడంలో పోలీసులకు సహకరిస్తున్నారు. కేసును ఛేదించేందుకు పోలీసులు పరిసరాల్లోని క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.హైదరాబాద్ - బీజాపూర్ రహదారిపై రాస్తారోకో..మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ పరిధిలో హనుమాన్ ఆలయం లో విగ్రహాలను (Han...