Odisha CM | ఒడిశాలో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ఎవరు..?
Mohan Charan Majhi : ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఊహాగానాలకు తెరపడింది. సీనియర్ నేత మోహన్ చరణ్ మాఝీ (Mohan Charan Majhi)ని ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవతి పరిదా ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ఉంటారని తెలిపారు. బుధవారం ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 2000 నుంచి కోస్తా రాష్ట్రంలో అధికారంలో ఉన్న BJDని BJP ఓడించింది, ఆరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని భావించిన నవీన్ పట్నాయక్ ఆశలు ఆడియాసలయ్యాయి. మోహన్ చరణ్ ఒడిశాలో బిజెపికి మొదటి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్నారు. .
మోహన్ చరణ్ మాఝీ ఎవరు?
53 ఏళ్ల మోహన్ చరణ్ మాఝీ ఒక గిరిజన నాయకుడు. 2000లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. మాజీ సర్పంచ్ (గ్రామాధికారి) అయిన మాఝీ, కియోంజర్ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగు పర్యాయాలు, 2000, 2004, 2019, ...