
‘లవ్ జిహాద్’కు కుటుంబ విచ్ఛిన్నమే కారణం – Mohan Bhagwat
'స్త్రీ శక్తి సంవాద్'లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్భోపాల్ : మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదు, వారు మతం, సంస్కృతి, జాతీయ నైతికతకు రక్షకులని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. భోపాల్‌లో జరిగిన ‘స్త్రీ శక్తి సంవాద్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సామాజిక సవాళ్లు, ముఖ్యంగా ‘లవ్ జిహాద్’ వంటి అంశాలను ఎదుర్కోవడంలో కుటుంబాల పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.కుటుంబాల్లో సంభాషణలు పెరగాలి'లవ్ జిహాద్'ను అడ్డుకోవడానికి మోహన్ భగవత్ మూడు అంచెల వ్యూహాన్ని ప్రతిపాదించారు.నిరంతర సంభాషణ: తల్లిదండ్రులు, పిల్లల మధ్య గ్యాప్ ఉండకూడదు. ఇంట్లో చర్చలు తగ్గినప్పుడే బయటి వ్యక్తులు కుమార్తెలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు.స్వీయ అవగాహన: బాలికలకు తమ సంస్కృతిపై అవగాహనతో పాటు, రక్షణ నైపుణ్యాలను నేర్పించాలి.సామాజిక స్పందన: నేరస్థుల పట్ల సమాజం కఠినంగా ఉండాలి. శాశ...


