Modi Government
Indian Railway | భారత్ లో అతి పొడవైన రైలు.. ఆశ్చర్యమనిపించే విషయాలు..
Indian Railway | దశాబ్దకాలంగా భారత్ లో భారతీయ రైల్వే ఎన్నడూ చూడని ప్రగతి సాధించింది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్ పునరాభివృద్ధి చేపడుతూనే కొత్త రైళ్లను కూడా పెద్ద సంఖ్య ప్రవేశపెడుతోంది. రైల్వే మౌలిక సదుపాయాలు 2014 నుంచి పూర్తిగా మారిపోయాయి. భారతదేశ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రైలు ప్రయాణాలను అందిస్తుంది. Indian Railway : ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదే.. ఇక భారతదేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు (longest […]
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు సర్వం సిద్ధం
One Nation, One Election bill | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సర్వన్నద్ధమైంది. కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 12న కీలకమైన ‘ఒక దేశం, ఒకే ఎన్నికల’ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.. దీనిని ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే చాన్స్ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ఆలోచనను “చారిత్రకమైనది” అని పేర్కొంది. వన్ నేషన్, […]
Waqf Board | వక్ఫ్ బోర్డు అధికారాలకు అడ్డుకట్ట వేయనున్న మోదీ సర్కార్? అసలేంటీ వివాదం..
Waqf Board | ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. వక్ఫ్ చట్టాన్ని సవరణలు చేస్తూ త్వరలో బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, శుక్రవారం (ఆగస్టు 2) సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదిత సవరణలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ఏ భూమినైనా క్లెయిమ్ […]
RSS | ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్ఎస్ఎస్ సోమవారం (జూలై 22) స్వాగతించింది. కేంద్రం చర్యపై ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రచార సారథి సునీల్ అంబేకర్ స్పందిస్తూ.. ‘గత 99 ఏళ్లుగా దేశ పునర్నిర్మాణంలోనూ, సమాజ సేవలోనూ ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం నిమగ్నమై ఉంది. దేశ భద్రతలో సంఘ్ సహకారం కారణంగా, ఐక్యత-సమగ్రత, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాజంతో మమేకమై సేవలందించడం చేశాయని […]
MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
MSP : కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూన్ చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త మంత్రివర్గం వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి, గోధుమ, పత్తి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర ( MSP) పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం జోడించి ఈ కొత్త ధరలను నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. […]
Jammu And Kashmir | ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం ఎలా సాధ్యమైంది..
Jammu And Kashmir : 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో సమూలమైన మార్పులు వచ్చాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ కాశ్మీర్ లోయ అత్యధిక ఓటింగ్‌తో మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే లోయలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. రికార్డు స్థాయి పోలింగ్.. జమ్మూ కాశ్మీర్‌లో బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్-రాజౌరీ, ఉధంపూర్, జమ్మూతో సహా ఐదు పార్లమెంట్ […]
