Friday, February 13"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: MMTS

local trains | స‌రికొత్త‌ ఫీచర్లతో లోకల్ రైళ్లు, త్వరలో ఈ నగరంలో 300 కి.మీ కొత్త ట్రాక్‌లు

local trains | స‌రికొత్త‌ ఫీచర్లతో లోకల్ రైళ్లు, త్వరలో ఈ నగరంలో 300 కి.మీ కొత్త ట్రాక్‌లు

National
Mumbai local trains : భార‌త‌దేశంలో అత్య‌ధిక జ‌నాభా గ‌ల న‌గ‌ర‌మైన ముంబైలో లోకల్ రైళ్లు నిత్యం కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎన్ని లోకల్ రైళ్లు వేసినా ప్రయాణికులకు ఏమాత్రం స‌రిపోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ముంబై ప్రయాణికులకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై నగ‌రంలో రద్దీని తగ్గించడంతోపాటు మెరుగైన లక్షణాలతో కూడిన కొత్త-డిజైన్ రైళ్లను ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ(Mumbai suburban railway system ) లో త్వరలో చేర్చ‌నున్న‌ట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) ప్రకటించారు. ముంబైలోని సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే లైన్లలో ప్రస్తుతం రూ.16,400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని వైష్ణవ్ పేర్కొన్నారు.రెండు స్థానిక రైళ్ల మధ్య సమయ అంతరాన్ని ప్రస్తుతం 180 సెకన్లుగా తగ్గించే ప్రణాళికలు ఉన్నాయని ఆయన హైలైట్ చేశారు. ప్రయాణికుల‌ రద్దీని తగ్గించడానికి సేవల ఫ్రీక్వెన్సీని పెంచడా...
Charlapalli railway station | విమానాశ్ర‌యాన్ని త‌ల‌పించేలా.. చర్లపల్లి రైల్వేస్టేషన్.. కానీ ఇక్క‌డికి చేరుకునేదెలా?

Charlapalli railway station | విమానాశ్ర‌యాన్ని త‌ల‌పించేలా.. చర్లపల్లి రైల్వేస్టేషన్.. కానీ ఇక్క‌డికి చేరుకునేదెలా?

Telangana
Charlapalli railway station | హైదరాబాద్: అత్యుత్తమ విమానాశ్రయాలను త‌ల‌పించేలా రూ.430 కోట్లతో అభివృద్ధి చేసిన చ‌ర్లపల్లి రైల్వే స్టేషన్ దేశంలోని స‌క‌ల స‌దుపాయాల‌తో హైటెక్ హంగుల‌తో అల్ట్రామోడర్న్ ప్యాసింజర్ ఫెసిలిటీగా రెడీ అయింది. కొత్త స్టేషన్ వచ్చే నెలలో ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. అయితే ప్రయాణికులకు సులువుగా ఈ స్టేష‌న్ కు చేరుకోవ‌డానికి సమర్థవంతమైన కనెక్టివిటీని అందించే సౌక‌ర్యాలు ఇప్ప‌టివ‌ర‌కు పూర్తిచేయ‌లేదు.రాష్ట్ర ప్రభుత్వం చర్లపల్లి స్టేషన్‌కు వెళ్లేందుకు రెండు వైపులా రోడ్లను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. అయితే సమన్వయ లోపంతో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులు అర్ధంత‌రంగా నిలిచిపోయాయి. ఫలితంగా, ప్రయాణికులు ఈ స్టేష‌న్ కు చేరుకోవ‌డం క‌ష్టంగా మారింది. మ‌రోవైపు కొత్త స్టేషన్ వైపు ఉన్న వివిధ రోడ్లను ప‌లు కార‌ణాల ద్వారా ప్రారంభించ‌లేదు. ఇటీవల పూర్తయిన మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సి...
ఘట్‌కేసర్ – సనత్‌నగర్ మార్గంలో MMTS  సర్వీస్ లకు భారీగా డిమాండ్.. కొత్త స్టేషన్లు నిర్మించాలని వినతులు..

ఘట్‌కేసర్ – సనత్‌నగర్ మార్గంలో MMTS  సర్వీస్ లకు భారీగా డిమాండ్.. కొత్త స్టేషన్లు నిర్మించాలని వినతులు..

Telangana
Ghatkesar-Sanathnagar MMTS | ఘట్‌కేసర్ - సనత్‌నగర్ కొత్త MMTS (మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌) రైళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ సెక్షన్‌లో కొత్త MMTS స్టేషన్లు నిర్మించాలనే డిమాండ్లు  కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. సాధారణ ప్రయాణికులు, విద్యార్థులు ఈ మార్గంలో  పెద్ద సంఖ్యలో ప్రతీరోజు ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల సౌకర్యార్థం ఆనంద్‌బాగ్‌లో కొత్త స్టేషన్,  అల్వాల్‌లోని లయోలా కాలేజీ సమీపంలో స్టేషన్‌ను నిర్మించాలని MMTS రైలు స్టేషన్ సాధన సమితి,  సబర్బన్ రైలు ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు  రైల్వే అధికారులను కోరారు.Ghatkesar-Sanathnagar MMTS : ఘట్‌కేసర్-సనత్‌నగర్ బై-పాస్ లైన్‌లో కొత్త స్టేషన్‌ల కోసం స్థలాలను గుర్తించేందుకు తాత్కాలిక సర్వే కమిటీని ఏర్పాటు చేయాలని సబర్బన్ రైలు ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులను కోరారు.  “చెర్లపల...
Ghatkesar MMTS | ఘట్ కేసర్ లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభం.. టైమింగ్స్, హాల్టింగ్స్ వివరాలు ఇవే..

Ghatkesar MMTS | ఘట్ కేసర్ లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభం.. టైమింగ్స్, హాల్టింగ్స్ వివరాలు ఇవే..

Telangana
Ghatkesar -Lingampalli Train Service : ఘట్ కేసర్ - లింగంపల్లి రైలు సర్వీస్, సంగారెడ్డిలో మంగళవారం రూ.7,200కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఘట్ కేసర్  - లింగంపల్లి - మౌలాలి - సనత్ నగర్ మీదుగా ప్రారంభమైన ఎంఎంటీఎస్ (మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్) రైలు సర్వీస్ నుకూడా మోదీ ప్రారంభించారు. ఈ రైలు సర్వీస్..  హైదరాబాద్ - సికింద్రాబాద్ వ్యాప్తంగా  ప్రసిద్ధ సబర్బన్ రైలు సేవలను అందించనుంది.ఘట్ కేసర్-లింగంపల్లి మార్గంలో తొలి రైలు  మంగళవారం ఉదయం 10.45 గంటలకు మొదటి  ప్రయాణం ప్రారంభించి మధ్యాహ్నం 12.40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది. మౌలాలి-సనత్ నగర్-మీదుగా ఘట్ కేసర్ -లింగంపల్లి ఎంఎంటీఎస్ ఫీచర్లు..ఈ సర్వీస్ MMTS పరిధిని ప్రస్తుత 90 కి.మీ (44 స్టేషన్లు) నుండి 123.52 కి.మీ (53 స్టేషన్లు)కి పెంచుతుంది.  కొత్త విభాగం MMTSని తూర్పు వైపున ఉన్న సికింద్రాబా...