TGSRTC : ఈ రెండు జిల్లాలో కొత్త ఆర్టీసీ బస్ డిపోలు..
TGSRTC | తెలంగాణ ఆర్టీసీని ముందుకు నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. ఆర్టీసీలో త్వరలో నియామకాలు ఉంటాయని ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రకటించారు. అలాగే కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నారు. అద్దె బస్సుల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రాజధాని నగరంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది.
పెద్దపల్లి, ములుగులో కొత్త బస్ డిపోలు
తాజాగా తెలంగాణలో కొత్తగా రెండు ఆర్టీసీ (TGSRTC) బస్ డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత 15 సంవత్పసరాలుగా రాష్ట్రంలో ఒక్క కొత్త బస్సు డిపో కూడా ఏర్పాటు చేయలేదని ఆయన గు...