ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వంకీలక అప్ డేట్
Indiramma Illu Scheme | రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే నాలుగేళ్లలో నిరుపేదల కోసం 20 లక్షల ఇండ్లను నిర్మిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) మంగళవారం వెల్లడించారు. హియాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.33 జిల్లాలకు 33 మంది ప్రాజెక్టు డైరెక్టర్లుఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్ధాయి ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించారు. ప్రతి సంవత్సరం నాలుగున్నర లక్షల చొప్పున రానున్న నాలుగేళ్లలో 20 లక్షలకు పైగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. హౌసింగ్ కార్పొరేషన్ బలోప...