Metro Rail Phase-2 | ఊపందుకున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్ట్.. ఫైనల్ డీపీఆర్ లు సిద్ధం!
Metro Rail Phase-2 Corridors | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. అన్ని కారిడార్‌లకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డిపిఆర్‌లు) పూర్తవుతున్నాయని సీనియర్ అధికారులు ఆదివారం ప్రకటించారు. దాదాపు రూ. 32,237 కోట్ల వ్యయంతో అంచనా వేసిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భాగ్యనగరం అంతటా మెట్రో కనెక్టివిటీని అందిస్తుంది.
డీపీఆర్ పై ముఖ్యమంత్రి సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో డిపిఆర్ తయారీపై సమీక్షించారు. ఈ సమీక్ష సందర్భంగా, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి ప్రాజెక్ట్ అలైన్‌మెంట్, కీలక ఫీచర్లు, స్టేషన్ స్థానాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించారు. ఫేజ్-2 మొత్తం 116.2 కి.మ...