Manipur violence: అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు విగత జీవులుగా.. సోషల్ మీడియాలో కలకలం రేపిన ఫోటోలు
Manipur violence: జూలై 6 నుంచి అదృశ్యమైన ఇద్దరు మణిపురి విద్యార్థుల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమావడం సంచలనం రేపింది.. హత్యకు ముందు, హత్య తర్వాత ఫోటోలు ఇప్పుడు అందరినీ కలచివేస్తున్నాయి..ఒక చిత్రంలో ఇద్దరు విద్యార్థులు నేలపై కూర్చున్నట్లు చూపించారు, వారి వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులు కనిపిస్తున్నారు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరో చిత్రంలో ఇద్దరు విద్యార్థులు విగతజీవులుగా పడి ఉన్నట్లు కనిపిస్తున్నాయి.విద్యార్థులను 17 ఏళ్ల హిజామ్ లింతోంగంబి, 20 ఏళ్ల ఫిజామ్ హేమ్‌జిత్‌గా గుర్తించారు.ఈ చిత్రాలు ఆన్‌లైన్‌లో కనిపించిన తర్వాత, విద్యార్థుల కిడ్నాప్ హత్యకు పాల్పడిన వారందరిపై వేగంగా చర్యలు తీసుకుంటామని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రజలకు హామీ ఇచ్చారు.జులై 2023 నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థులు ఫిజామ్ హేమ్‌జిత్, 20, హిజామ్ లింతోంగంబి (17)ల ఫోటోలు సోషల్ మీడియాలో ప్...