Maha Vikas Aghadi | మహారాష్ట్ర ఎన్నికల్లో ఉచితాల చిట్టా.. రూ.3 లక్షల రుణమాఫీ.. మహిళలకు ప్రతీ నెలా రూ.3,000, బస్సు ఫ్రీ.. నిరుద్యోగులకు రూ.4000 ఇంకా..
Maharashtra Assembly Elections 2024 | మహారాష్ట్రలో అధికారమే లక్ష్యం ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ( Maha Vikas Aghadi ) కూటమి బుధవారం మేనిఫెస్టోను ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ. 3,000 ఆర్థికసాయం, రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. శివసేన (UBT)-ఎన్‌సిపి (NCP)-కాంగ్రెస్ (Congress) కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో కృషి సమృద్ధి యోజన కింద, రైతులు పంట రుణాలను సక్రమంగా చెల్లించేందుకు ప్రోత్సాహకంగా రూ. 3 లక్షల 50,000 వరకు రుణమాఫీ పొందుతారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 భృతి, రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఉచిత మందులు తదితర హామీలను ప్రకటించింది. ఇక్కడి బీకేసీ మైదానంలో ఎంవీఏ అగ్ర నాయకులు ప్రసంగించారు.ముఖ్యంగా, మహారాష్ట్రలోని బిజెపి-శివసేన-ఎన్‌సిపి ప్రభుత్వం ప్రస్తుతం తమ ఫ్లాగ్‌షిప్ `లడ్కీ బహిన్' పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 1,...