నిమిషాంబదేవి ఆలయంలో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం
Warangal: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గురువారం సాయంత్రం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని(satyanarayana swamy vratham) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కాలనీలో కొలువుదీరిన నిమిషాంబదేవి ఆలయంలో వేదపండితులు కల్యాణ్ సమక్షంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలు పెద్ద ఎత్తున హాజరై వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలపించిన భక్తిగీతాలు అందరనీ అలరిచాయి. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.కాగా నిమిషాంబదేవి ఆలయంలో శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు కల్యాణ్ తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.
అభయాంజనేయస్వామి ఆలయంలో నేడు మహాన్నదానం
కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబరు 22న శుక్రవారం మధ్యాహ్నం మహాన్నదానం నిర్వహించనున్నట్...