సాహిత్యం : నిన్న.. కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు..
Literature article
*నిన్న*
కాలం ఎప్పుడూ ఒకేలా సాగదుఇప్పుడు నీతో ఉన్నా నీవు గుర్తించనిది
తరువాత జ్ఞాపకమై వేదిస్తుందేమో..!!పరిమితి మరిచిన వ్యాపకాల మాయ
మనిషిలోని మనసును మాయం చేసి
మమతకు దూరంగా తీసుకెళ్తోంది..
కన్నీళ్లను కూడా పట్టించుకోని అతని నైజం
ఆమె దుఃఖన్ని తలగడలో దాచుకోమంటేమౌనంగా రోధించిన సహనం
జీవితాన్ని సైతం వెలివేసుకుని వెళ్ళాక
ఒంటరితనంలో వెలితి అర్ధమౌతున్నా ఏం లాభం
ఆ ఆవేదన వెనుక ఉన్న నిరాశ...
వెలివేతలో ఉన్న ఎదకోత..
ఇప్పుడు స్వయంగా
అనుభవించక తప్పదు..!!
*అనూశ్రీ గౌరోజు*Literature
జీవం
కన్నులజారే కన్నీటిలాగే
మబ్బులమాటున దాగిన చినుకుకైనా
కురిస్తే పొదువుకునే తావొకటి కావాలి..పత్రంపై ముత్యంగానో
పువ్వుపై స్పర్శగానో
పుడమిలో చిన్న తడిగానో...
నిలిచేది కాసేపైనా
తనకంటూ ఓ చెలిమితోడు కావాలి..మనసుకైనా అంతే
కష్టమో కన్నీళ్ళో తడిమితే
కాస్త ఓదార్...