Sunday, August 31Thank you for visiting

Tag: lioness attack in Gujarat

సింహానికి ఎదురెళ్లి తన ఆవును కాపాడుకున్నాడు..

సింహానికి ఎదురెళ్లి తన ఆవును కాపాడుకున్నాడు..

National
గుజరాత్‌లో సింహం దాడి నుంచి ఓ రైతు తన ఆవును కాపాడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీనిని గుజరాత్‌లోని జునాగఢ్‌లోని కేషోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సింహం ఆవుపై దాడిచేసిన ఘటన గిర్ సోమనాథ్ జిల్లాలో చోటుచేసుకుందని ఆయన ట్వీట్ చేశారు. తన ఆవుపై దాడి చేస్తున్న సింహం దగ్గరికి వెళ్లి దాన్ని తరిమికొట్టడానికి యత్నించాడు. ఆ క్లిప్‌ను అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు కారులో నుంచి రికార్డ్ చేశాడు.సింహం ఆవు మెడను కొరికి ఎంతకీ వదలలేదు. సింహం పట్టు నుండి బయటపడేందుకు ఆవు ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఆ పెనుగులాటలో రెండు జంతువులు కూడా రోడ్డు కిందకు దిగుతుండగా అప్పుడే రైతు వస్తూ సింహాన్ని భయపెట్టేందుకు చేయి పైకెత్తి అరుస్తూ కనిపించాడు..వెంటనే రోడ్డుపై ఓ ఇటుకను తీసుకొని వేగంగా ఆవు వైపు కదిలాడు. రైతు అరుపులను చూసి సింహ...