KSRTC | ఉచిత ప్రయాణాలతో రూ. 295 కోట్ల నష్టం.. బస్ చార్జీల పెంచనున్న కర్ణాటక ప్రభుత్వం..!
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సు ఛార్జీల పెంపును 20 శాతం వరకు ప్రతిపాదించాలని భావిస్తోంది. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి పథకం (Shakti scheme) కారణంగా గత మూడు నెలల్లో KSRTC రూ.295 కోట్ల మేర భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఈ క్రమంలో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి పథకం కారణంగా NWKRTC నష్టాలను చవిచూస్తోందని NWKRTC చైర్మన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కేజ్ పేర్కొన్నారు. తమ సమావేశంలో బస్సు చార్జీలను పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్‌పర్సన్ ఎస్‌ఆర్ శ్రీనివాస్ సైతం ధ్రువీకరించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య డిపార్ట్‌మెంట్‌ను నిలబెట్టుకోవడానికి టికెట్ ధరలను పెంచాల్సిన ఆవశ్యకతను వారు వివరిస్తున్నారు. గత శుక్రవారం...