Friday, April 4Welcome to Vandebhaarath

Tag: Kolkata

Kolkatha | బంగ్లాదేశ్ రోగులు మా ఆస్పత్రికి రావొద్దు.. కోల్ కత్తా ఆస్పత్రి నిర్ణయం..
Trending News

Kolkatha | బంగ్లాదేశ్ రోగులు మా ఆస్పత్రికి రావొద్దు.. కోల్ కత్తా ఆస్పత్రి నిర్ణయం..

Kolkatha | బంగ్లాదేశ్‌లోని హిందువుల (Hindu minorities )పై దాడుల‌కు నిర‌స‌న‌గా అలాగే భారత జాతీయ ప‌తాకానికి చేస్తున్న అవ‌మానాల‌కు నిర‌స‌న‌గా ప‌శ్చిమ బెంగాల్ లోని ఓ ఆస్ప‌త్రి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఉత్తర కోల్‌కతాలోని మానిక్‌తలా ప్రాంతంలోని ఆసుపత్రి బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం నిరవధికంగా అమలులో ఉంటుందని జెఎన్ రే హాస్పిట‌ల్‌ అధికారి ప్రకటించారు. హాస్పిట‌ల్ ప్రతినిధి సుభ్రాంషు భక్త్ మాట్లాడుతూ, “మేము ఈ రోజు నుంచి బంగ్లాదేశ్ రోగిని చికిత్స కోసం చేర్చుకోమని నోటిఫికేషన్ జారీ చేశాం. ఎందుకంటే వారు భారతదేశం పట్ల అవ‌మానక‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అని తెలిపారు.బంగ్లాదేశ్ వైఖ‌రిని నిరసనగా కోల్‌కతాలోని ఇతర ఆసుపత్రులు కూడా ఇదే వైఖరిని అవలంబించాలని భక్త్ పిలుపునిచ్చారు. " బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం అందించేందుకు భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించింది , అయ...
RG Kar case : మొత్తం కుట్ర చేసి నన్నుఇరికించారు.. కోల్‌క‌తా కేసు నిందితుడి సంచ‌ల‌న వ్యాఖ్యలు
Crime

RG Kar case : మొత్తం కుట్ర చేసి నన్నుఇరికించారు.. కోల్‌క‌తా కేసు నిందితుడి సంచ‌ల‌న వ్యాఖ్యలు

RG Kar case | ఆర్‌జి కర్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు, సంజయ్ రాయ్ సోమవారం షాకింగ్ కామెంట్స్ చేసాడు, కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ మొత్తం కేసును కుట్ర పన్నారని, అక్ర‌మంగా త‌న‌ను ఇరికించారని ఆరోపించారు. సీల్దా కోర్టు నుంచి తీసుకెళ్తున్న సమయంలో పోలీసు వ్యాను లో నుంచి ఆయన ఈ సంచ‌ల‌న‌ ఆరోపణలు చేశారు. "వినీత్ గోయల్ (మాజీ కోల్‌కతా పోలీస్ కమీషనర్) మొత్తం కుట్ర (ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ రెసిడెంట్ డాక్టర్‌పై అత్యాచారం హత్య) చేసి నన్ను ఇరికించాడని చెప్పాడు.ఈ కేసులో ఈరోజు విచారణ ప్రారంభం కావడంతో సంజ‌య్‌ రాయ్‌ను సీల్డే కోర్టుకు తరలించారు. అదనపు జిల్లా ,సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ కోర్టులో విచార‌ణ‌లు జరిగాయి. ఈసంద‌ర్భంగా రాయ్‌ను మధ్యాహ్నం కోర్టుకు తీసుకువచ్చారు.భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (రేప్), సెక్షన్ 66 (మరణానికి కారణమైనందుకు శిక్ష), 103 (హత్యకు శిక్ష)...
Bengal Train Accident | పట్టాలు తప్పిన సికింద్రాబాద్ – షాలిమార్ ఎక్స్ ప్రెస్‌
Crime

Bengal Train Accident | పట్టాలు తప్పిన సికింద్రాబాద్ – షాలిమార్ ఎక్స్ ప్రెస్‌

Bengal Train Accident | పశ్చిమ బెంగాల్‌లోని హౌరా సమీపంలో శనివారం తెల్లవారుజామున 5:30 గంటలకు సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (West Bengal train derailment) కు చెందిన టి హ్రీ కోచ్‌లు పట్టాలు తప్పాయి. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని నల్పూర్ స్టేషన్‌లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన కోచ్‌లలో పార్శిల్ వ్యాన్, B1 ప్యాసింజర్ కోచ్ ఉన్నాయి.నల్పూర్ స్టేషన్‌లో రైలు మిడిల్ లైన్ నుంచి డౌన్ లైన్‌కు మారుతుండగా పట్టాలు తప్పినట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) ఓంప్రకాష్ చరణ్ తెలిపారు. "ఈ ఉదయం, 5.30 గంటలకు, 22850 సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ నల్పూర్ రైల్వే స్టేషన్‌లో మిడిల్ లైన్ నుంచి డౌన్ లైన్‌కు వెళుతుండగా పట్టాలు తప్పింది. ఇందులో ఒక పార్శిల్ వ్యాన్, రెండ...
West Bengal | జూనియర్ డాక్టర్ రేప్ కేసులో ఆగని నిరసన జ్వాలలు.. 50మంది సీనియర్‌ వైద్యుల రాజీనామా
Crime

West Bengal | జూనియర్ డాక్టర్ రేప్ కేసులో ఆగని నిరసన జ్వాలలు.. 50మంది సీనియర్‌ వైద్యుల రాజీనామా

Rg Kar Medical College Case | పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో (RG Kar Medical College ) వైద్య విద్యార్థిని అత్యాచారం, హ‌త్య‌ ఘటనలో షాకింగ్ ప‌రిణామాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారంలో అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్‌ వైద్యులు కొనసాగిస్తున్న నిరాహార‌ దీక్షకు సీనియర్‌ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు సైతం మద్దతు తెలిపారు. మంగళవారం ఉదయం 15 మంది సీనియర్‌ వైద్యులు జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉండ‌గా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలోని 50 మంది సీనియర్‌ వైద్యులు, బోధనా సిబ్బంది ఒక్క‌సారిగా రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వీరు రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉంది.కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ప్రభుత్వ కళాశాల హాస్పిట‌ల్ లో ఆగస్టు 9న జూనియర్ డాక్ట‌ర్ ...
Kolkata Rape Murder Case:  ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్
Crime

Kolkata Rape Murder Case: ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్

Kolkata Rape Murder Case: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసులో సిబిఐ పెద్ద అడుగు వేసింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ (Sandeep Ghosh)ను సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారం (సెప్టెంబర్ 14) అరెస్టు చేసింది. సెప్టెంబర్ 23 వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.గతంలో ఆర్థిక అవకతవకల కేసులో మాజీ ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పుడు తాజాగా అత్యాచారం-హత్య కేసులో నిందితుడిగా కూడా అరెస్టు చేశారు. ఆర్‌జి కర్ రేప్ కేసు దర్యాప్తులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, సాక్ష్యాలు మాయం చేసినట్లు ఆరోపణలపై సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజీత్ మండల్‌లను సిబిఐ అరెస్టు చేసింది. సందీప్‌ను ఆదివారం సీల్దా కోర్టులో హాజరుపరచనున్నారు. సాక్ష్యాల తారుమారు నివేదికల ప్రకారం, సందీప్ ఘో...
Kolkata rape case | కోల్‌కతా రేప్ కేసులో నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Crime

Kolkata rape case | కోల్‌కతా రేప్ కేసులో నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

Kolkata rape case | కోల్‌కతా ట్రైనీ డాక్ట‌ర్‌పై అత్యాచారం హత్యకు సంబంధించిన విషాదక‌ర‌ కేసులో ఒక‌ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. సీల్దా కోర్టు శుక్రవారం నిందితుడు సంజయ్ రాయ్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. మరోవైపు, శనివారం ఉదయం 10 గంటలలోగా కేసు డైరీ, సీసీటీవీ ఫుటేజీ, ఇతర కీలక వివరాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అందజేయాలని కలకత్తా హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది.ఆగస్టు 9న జరిగిన ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ - హాస్పిటల్‌లోని సెమినార్ రూమ్‌లో జూనియర్ డాక్టర్ మృతదేహం కనిపించింది. అత్యంత కిరాత‌కంగా ఆమెను చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి హ‌త్య‌చేయ‌డంపై దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు పెల్లుబికాయి.కోల్ కతా రేప్ కేసులో (Kolkata rape case)   నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తం...
RG Kar Hospital | ఆర్జికర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ పై విస్తుగొలిపే నేరారోప‌ణ‌లు | అనాథ మృతదేహాలను వదల్లేదు..
Trending News

RG Kar Hospital | ఆర్జికర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ పై విస్తుగొలిపే నేరారోప‌ణ‌లు | అనాథ మృతదేహాలను వదల్లేదు..

Kolkatha Rape Murder Case | కోల్‌కతాలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై దారుణమైన అత్యాచారం హత్య నేపథ్యంలో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్  (RG Kar Hospital ) మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ (Sandip Ghosh) పై షాకింగ్ ఆరోపణలు వెలుగు చూశాయి. ఘోష్ హయాంలో అవినీతి, నేర కార్యకలాపాలకు సంబంధించి భయంకరమైన ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. సంస్థలో "మాఫియా లాంటి" పాలన కొన‌సాగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.2021లో ప్రిన్సిపాల్‌గా నియమితులైన ఘోష్, ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీకి వ‌చ్చే క్లెయిమ్ చేయని మృత దేహాలను అనధికార అవసరాల కోసం అమ్ముకొని సొమ్ముచేసుకున్న‌ట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి. మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అక్తర్ అలీ.. ఘోష్ "బయోమెడికల్ వేస్ట్ స్కామ్" నిర్వహించారని, రబ్బరు గ్లోవ్‌లు, సెలైన్ బాటిళ్లు, సిరంజిలు, సూదులు వంటి వ్యర్థాలను అనధికారిక సంస్థలకు విక్రయించేవారని పేర్కొన్నారు. ఈ పద్ధతులు బయో-...
Kolkata rape-murder case | ఆగస్టు 17న 24 గంటల దేశవ్యాప్త వైద్యుల సమ్మె ప్ర‌క‌టించిన‌ IMA
Crime

Kolkata rape-murder case | ఆగస్టు 17న 24 గంటల దేశవ్యాప్త వైద్యుల సమ్మె ప్ర‌క‌టించిన‌ IMA

Kolkata rape-murder case | కోల్‌కతా: కోల్‌కతాలో ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ ట్రైనీ డాక్టర్‌పై అత్యంత కిరాత‌కంగా అత్యాచారం, హత్య జరిగిన ఘ‌ట‌న దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలికి సంఘీభావంగా, అలాగే వైద్యుల‌పై ర‌క్ష‌ణ కోసం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ఈనెల 17 ఉదయం 6 గంటలకు దేశవ్యాప్తంగా 24 గంటల సమ్మెను ప్రకటించింది. కాగా ఆర్జీక‌ర్‌ ఆసుపత్రిలో ఆస్తిని ధ్వంసం చేయ‌డాన్ని కూడా ఖండించింది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో అత్యవసర సేవలు కొనసాగుతుండగా, సాధార‌ణ సేవ‌లు పూర్తిగా నిలిపివేశారు. కాగా కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ట్రైనీ డాక్టర్ మరణంపై దర్యాప్తు కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసిన విష‌యం తెలిసిందే..వైద్యుల‌ సమ్మెలో భాగంగా, ఔట్ పేషెంట్ విభాగాలు మూసివేశారు. షెడ్యూల్ చేయబడిన అన్ని శస్త్రచికిత్సలు వాయిదా వేశారు. "కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో జరిగిన క...
Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్..  ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?
Trending News

Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్.. ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?

Underwater Metro Train | పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతా (Kolkata)లో నిర్మించిన భార‌త‌దేశంలో మొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న న‌ది కింద ఈ ట‌న్నెల్ ను నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌క‌తాలో ర‌వాణా సుల‌భ‌త‌రం కానుంది.కోల్ క‌తాలోని ఈ అండర్‌ వాటర్‌ మెట్రో టన్నెల్ లో ప్రధాని మోదీ తొలిసారి విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. రూ.120 కోట్లతో 16.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని ఇంజినీరింగ్‌ అద్భుతంగా భావిస్తున్నారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ అండ‌ర్ వాట‌ర్ మెట్రో లైన్‌ కోల్‌కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్‌ లేక్‌లను అనుసంధానిస్తుంది. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉండగా, అందులో మూడు భూగర్భం (జలాంతర్గ)లో ఉన్నాయి. ...
పచ్చబొట్లే కామాంధులను పట్టించాయి.. బాలికపై సామూహిక అత్యాచార నిందితులు నలుగురికి జీవిత ఖైదు
Crime

పచ్చబొట్లే కామాంధులను పట్టించాయి.. బాలికపై సామూహిక అత్యాచార నిందితులు నలుగురికి జీవిత ఖైదు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లాలో అక్టోబర్ 2021లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆ నేరానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన నలుగురు వ్యక్తులకు బుధవారం జిల్లా కోర్టు వారి జీవిత ఖైదు విధించింది. అయితే ఈ కేసులో నిందితుల చేతులపై ఉన్న టాటూ(Tattoos)లు కీలకంగామారి వారిని పట్టించాయి.ముర్షిదాబాద్‌లోని లాల్‌బాగ్ సబ్-డివిజనల్ కోర్టులో దోషులు బాసుదేబ్ మొండల్, మిథున్ దాస్, ఆకాష్ మొండల్ తోపాటు అరుణ్ మోండల్‌లకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి దీప్తా ఘోష్ తీర్పు వెలువరించారు. . లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పురుషులు దోషులుగా తేల్చారు. కాగా ఈ కేసు విచారణ 120 రోజుల్లో ముగిసింది." గ్యాంగ్ రేప్ బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని కోర్...