
కాళోజీ కళాక్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలి
‘కుడా’ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
Warangal: సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమే కాళోజీ కళాక్షేత్రమని ‘కుడా’ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. శుక్రవారం హన్మకొండలోని కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులపై ‘కుడా’ చైర్మన్ హనుమకొండ, కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ‘కూడా’ వైస్ చైర్మన్ ప్రవీణ్యతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సుదర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకుని రావాలని అన్నారు. కాళోజీ కాలక్షేత్రం లో ఆర్ట్ గ్యాలరీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. కాళోజీ రచనలు, సాహిత్యం, జీవిత చరిత్ర, పరిశోధనలు, ఆయన వాడిన వస్తువులు, ఫొటోలు, డాక్యుమెంటరీలే అన్నీ ఈ ఆర్ట్ గ్యాలరీ లో ఉండాలి అని పేర్కొన్నారు. ప్రేక్షకులకు సీ...