
రూ. 599 ధరతో జియో ఎయిర్‌ఫైబర్ విడుదలైంది.. అదిరిపోయే ప్లాన్లు.. ఆఫర్లు.. 16కుపైగా ఓటీటీలు..
టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నజియో ఎయిర్ ఫైబర్ (jio airfiber ) వచ్చేసింది. రిలయన్స్ సంస్థ హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పూణెతో సహా 8 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్‌ను ఈరోజు (సెప్టెంబర్ 19న) ఆవిష్కరించింది. గత నెలలో జరిగిన రిలయన్స్
ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సందర్భంగా వైర్‌లెస్ ఇంటర్నెట్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. Jio AirFiber వినియోగదారులు గరిష్టంగా 1Gbps వేగంతో ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయవచ్చు. అలాగే 550 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లను, 16 ఓవర్-ది-టాప్ (OTT) యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.
జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏంటి?
ఇది 5G ఆధారిత వైర్‌లెస్ WiFi సర్వీస్.. అత్యంత వేగంతో గృహ, వ్యాపార అవసరాలకు ఇంటర్నెట్ ను అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేబుల్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్స్‌కు ప్రత్యామ్...