పాఠశాల వాట్సప్ గ్రూప్‌లో హమాస్ హింసాత్మక వీడియోలను పోస్ట్ చేసిన విద్యార్థి
అరెస్టు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్
Jharkhand : ఇజ్రాయెల్‌తో యుద్ధం(Israel-Hamas war )లో హమాస్ హింసకు పాల్పడినట్లు ఆరోపించే వీడియోలను మంగళవారం ఒక మాజీ విద్యార్థి పాఠశాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
హింసకు సంబంధించిన గ్రాఫిక్ చిత్రాలే కాకుండా, రామ్‌ఘర్ (Ramgarh) పాఠశాల మాజీ విద్యార్థి పోర్న్ వీడియోలను కూడా షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాజ్రప్పా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి హరి నందన్ సింగ్ మాట్లాడుతూ.. రామ్‌ఘర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగిందని.. క్లాస్ టీచర్లు విద్యార్థులతో నిరంతరం టచ్‌లో ఉండటానికి ఈ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారని తెలిపారు. ఎనిమిదో తరగతి సోషల్ మీడియా గ్రూప్( social media group) లో వచ్చిన ఈ వీడియోను వెంటనే తొలగించినట్లు చెప్పారు.సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత వాట్సప్ గ్రూప్ (WhatsApp group) సెట్టింగ్‌లు మార్చేశ...