
డేంజర్ బెల్స్: నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి నిర్ధారణ
Japanese encephalitis : కేరళలోని కోజికోడ్‌లో నాలుగేళ్ల చిన్నారికి జపనీస్ మెదడువాపు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని మైక్రోబయాలజీ విభాగంలో ల్యాబ్ పరీక్షలో నాలుగేళ్ల బాలుడికి ఇన్ఫెక్షన్కు పాజిటివ్ అని తేలింది. శాంపిల్స్‌ను పూణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.
జూలై 15న తీవ్రజ్వరం, తలనొప్పి, తీవ్రమైన మెడ నొప్పి వంటి లక్షణాలతో బాలుడిని అడ్మిట్ చేశారు.
కాగా "జపనీస్ ఎన్‌సిఫిలైట్స్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది, పిల్లలు ఎక్కువగా దీని బారిన పడతారు" అని ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాయా సుధాకర్ తెలిపారు.బాధిత చిన్నారి ప్రభుత్వ వైద్య కళాశాలకు కిలోమీటరు దూరంలోని చేవాయూర్‌లోని చేవారంబలం నివాసి. "సంక్రమణ మరణాల రేటు ఎక్కువగా ఉన్నందున, వ్యాప్తి సంభవించిన ప్రాంతాన్ని శానిటైజ్ చేయాల్సి ఉంది.
జపనీస్ ఎన్...