Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: Jammu Kashmir medical college issue

SMVDIME | వైష్ణో దేవి మెడికల్ కాలేజీ అడ్మిషన్లపై రగులుతున్న జమ్మూ
National

SMVDIME | వైష్ణో దేవి మెడికల్ కాలేజీ అడ్మిషన్లపై రగులుతున్న జమ్మూ

Vaishno Devi Medical College Admissions Controversy : శ్రీ మాతా వైష్ణో దేవి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ (SMVDIME)లో మొదటి బ్యాచ్ MBBS ప్రవేశాలు తీవ్ర రాజకీయ దుమారానికి, సామాజిక ఉద్రిక్తతలకు దారితీశాయి. విద్యార్థుల ఎంపికలో ఒక నిర్దిష్ట వర్గానికి మాత్ర‌మే భారీగా సీట్లు దక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హిందూ సంఘాలు జమ్మూలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టాయి.ఘటనా స్థలంలో ఉద్రిక్తతజమ్మూలోని లోక్ భవన్ వద్ద 'శ్రీ మాతా వైష్ణో దేవి సంఘర్ష్ సమితి' ఆధ్వర్యంలో ఆందోళనకారులు పెద్ద ఎత్తున గుమిగూడారు. కేంద్రంలోని తమ సొంత ప్రభుత్వం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ (LG) మనోజ్ సిన్హాకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ (BJP) మహిళా విభాగం కూడా ఈ నిరసనలో చేరడం గమనార్హం. నిరసనకారులు ఎల్జీ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఎల్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు జనాన...