
Inner Ringroad Case : గురి.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్
Inner Ringroad Case: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలో లోకేష్ ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఏపీ సిఐడి నిందితుడిగా చేర్చడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Nara lokesh In Inner Ringroad Case: ఆంధ్రప్రదేశ్ అమరావతి (Amravathi) ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేశ్ (Nara Lokesh)) పేరును చేర్చింది. ఈమేరకు నారా లోకేశ్ పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలైంది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమ వ్యక్తిగత ఆస్తుల విలువను పెంచుకోడానికి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్లను మార్చారని సిఐడి(CID) ఆరోపణలు చేస్తోంది.సింగపూర్ కన్సల్టెన్సీకి మాస్టర్ ప్లాన్ తయారు చేసే బాధ్యతలను అప్పగించి, అందులో నిబంధనలను తమకు అనుగుణంగా మార్చుకున్నారని సీఐడీ అభియో...