ప్రయాణీకుల సౌకర్యం కోసం త్వరలో MEMU రైళ్లు
మే 2026 నుంచి కాజీపేట RMUలో ఉత్పత్తి ప్రారంభంహైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా, కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైళ్లను కాజీపేట రైలు తయారీ యూనిట్ (RMU)లో తయారు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డితో మంగళవారం సమావేశమయ్యారు. ఆయన, తెలంగాణకు సంబంధించిన ప్రధాన రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.MEMU రైళ్ల ప్రత్యేకతలు ఇవే:16–20 కోచ్‌లతో కూడిన ఆధునిక MEMU రైళ్లుగ్రామీణ – సెమీ అర్బన్ ప్రాంతాలను అనుసంధానించేందుకు అనుకూలంగా కనెక్టివిటీపండుగల సీజన్లలో ప్రయాణీకులకు భారీ ఉపశమనంకాజీపేట RMUలో రూ.716 కోట్లతో నిర్మాణం2026 జనవరి నాటికి నిర్మాణం ...