
Indian Railways 100-day Roadmap | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త! 100 రోజుల ఎజెండాలో విప్లవాత్మక సంస్కరణలు
Indian Railways 100-day Roadmap : దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మెరుగైన రైల్వే కనెక్టివిటీ కోసం భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే అనేక విప్లవాత్మక మార్పులు చేయాలని భావిస్తోంది.ఇందులో భాగంగా కొత్తగా 24 గంటల్లోనే టికెట్ వాపసు పథకం, వందే భారత్ స్లీపర్ రైలు, ఉదంపూర్-శ్రీనగర్-బారాముల రైలు లింక్ ప్రాజెక్ట్ చివరి విస్తరణ ప్రారంభం, రైల్వే ప్రయాణీకుల కోసం "సూపర్ యాప్", భారతదేశపు మొట్టమొదటి నిలువు లిఫ్ట్ రైల్వే వంతెన వంటి సంస్కరణలు చేపట్టనుంది. ఇవి కూడా 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులను చేపట్టనుంది.కొత్త ప్రభుత్వం కోసం 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలను అనుసరించి మంత్రిత్వ శాఖలు వివిధ "ప్రజలకు ఆకర్షణీయమైన హామీలను అమలు చేయడానికి స...