Telangana Rains | తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు
లోక్‌సభ ఎన్నికల వేళ.. వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్‌డేట్..!
Telangana Rains | లోక్ సభ ఎన్నికల వేళ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad ) ఆదివారం తెలిపింది. రాష్ట్రంలో పార్లమెంట్ నాలుగో విడుత ఎన్నికలు (Loksabha Elections 2024) జరుగనున్నాయి. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే..కాగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, భధ్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగ...