ఒకప్పుడు ఇజ్రాయెల్ పై తటస్థంగా ఉన్న భారతదేశం ఇప్పుడు మిత్రుడిగా ఎలా నిలిచింది..? మన మద్దతు పాలస్తీనా నుంచి Israel కు ఎలా మారింది.?
India-Israel relations: భారత దేశ చరిత్రలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులను కార్గిల్ యుద్ధ సమయంలో ఎదుర్కొంది. మే 3, 1999న, జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్-ద్రాస్ సెక్టార్‌లో పాకిస్తానీ దళాల చొరబాటు గురించి భారతదేశానికి తెలిసింది. మూడు వారాల తర్వాత, ఆపరేషన్ విజయ్ అనే కోడ్ పేరుతో మనదేశం ఎదురుదాడిని ప్రారంభించబడింది. అయితే, కాలం చెల్లిన సైనిక, సాంకేతిక పరికరాలు కలిగిన భారత రక్షణ దళాలకు వ్యూహాత్మక ప్రదేశాల్లోని బంకర్లలో దాక్కున్న పాకిస్తానీ సైనికులను గుర్తించడం.. వారిపై దాడి చేయడం చాలా కష్టంగా మారింది.సహాయం కోసం భారత్ అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. అయితే 1998లో అణ్వాయుధ పరీక్షలు చేపట్టిన కారణంగా అమెరికా నేతృత్వంలోని దేశాలతో సాంకేతిక, ఆర్థిక, ఆయుధాలకు సంబంధించి మన దేశం ఆంక్షలను ఎదుర్కొంటోంది. అంతటి క్లిష్ట సమయంలో కేవలం ఒక్క దేశం మాత్రమే భారత్‌కు బహిరంగంగా మద్దతుగా నిలిచింది.. అదే ఇజ్రాయెల్(I...