Operation Sindoor | పఠాన్‌కోట్, జైసల్మేర్‌లలో పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్
ఒక పాక్ పైలట్ పట్టివేతIndia Pakistan War | భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది. మే 8వ తేదీ గురువారం రాత్రి పాకిస్తాన్ అనేక భారతీయ నగరాలపై క్షిపణులను ప్రయోగించింది. వీటన్నింటినీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ భగ్నం చేసింది. దీని తర్వాత, భారత్ పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారీ దాడిని ప్రారంభించింది. ఈ క్రమంలో భారత యుద్ధ విమానాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ నుండి అనేక ఫైటర్ జెట్లు బయలుదేరాయి, వాటిలో ఒక యుద్ధ విమానాన్ని భారత ఆర్మీ కూల్చివేసింది.రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత ఆర్మీ పాకిస్తాన్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసిందని వార్తలు వస్తున్నాయి. ఫైటర్ జెట్‌పై దాడి తర్వాత, పాకిస్తాన్ పైలట్ జెట్ నుంచి దూకి, భారత భద్రతా దళాలకు పట్టుబడ్డాడు. పాకిస్తానీ పైలట్‌ను BSF QRT అదుపులోకి తీసుకుంది. అయితే, పాకిస్తాన్ ఫైటర్ జెట్ పైలట్ పట్టివేత ధ్రువీకరణ కాలేదు.పఠాన్‌కోట్‌లో పాకిస్తాన్ వై...