Friday, April 18Welcome to Vandebhaarath

Tag: hyderabad

New Flyovers | హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి ఐటీ కారిడార్‌లో త్వరలో 3 కొత్త ఫ్లైఓవర్లు
Telangana

New Flyovers | హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి ఐటీ కారిడార్‌లో త్వరలో 3 కొత్త ఫ్లైఓవర్లు

New Flyovers in Hyderabad : ట్రాఫిక్ జామ్‌లను పరిష్కరించడానికి, ఐటీ కారిడార్‌లో వేగ పరిమితులను పెంచే ప్రయత్నంలో, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) నగరంలో మూడు మల్టీ-లెవల్ ఫ్లైఓవర్‌లను నిర్మించాలని యోచిస్తోంది. దీని కోసం రూ. 800 కోట్లకు పైగా కేటాయించింది.ఎక్కడెక్కడంటే..GHMC ప్రణాళికలతో ఖాజాగూడ, విప్రో మరియు IIIT జంక్షన్లలో మూడు బహుళ-స్థాయి ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు.. ఐఐఐటీ జంక్షన్‌ ప్రాజెక్టుకు రూ.459 కోట్లు, ఖాజాగూడలోని మరో రెండు ఫ్లైఓవర్‌లకు రూ.220 కోట్లు, విప్రో జంక్షన్‌లకు రూ.158 కోట్లు కేటాయించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌ వరకు రోడ్డు విస్తరణకు మరో ప్రతిపాదన కూడా ఉంది. హైదరాబాద్‌లోని ఈ మూడు కొత్త ఫ్లైఓవర్‌లు ట్రాఫిక్‌ను సులభతరం చేయడమే కాకుండా నగరం మౌలిక సదుపాయాల వృద్ధికి దోహదపడతాయి. అంతే కాకుండా, నగర వాసులకు మెరుగైన వేగవంతమైన ప్రయాణ అనుభూ...
Earthquake in Telangana | తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం, ములుగు కేంద్రంగా ప్ర‌కంప‌ణ‌లు
Auto, Telangana

Earthquake in Telangana | తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం, ములుగు కేంద్రంగా ప్ర‌కంప‌ణ‌లు

Earthquake in Telangana | తెలుగు రాష్ట్రాల్లో బుధ‌వారం ఉద‌యం భూ ప్ర‌కంప‌ణ‌లు సంభ‌వించాయి. దీంతో ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) ప్రకారం బుధవారం ఉదయం తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. NCS ప్రకారం ఉదయం 7:27 గంటలకు ప్రకంపనలు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో NCS పోస్ట్ చేసిన వివ‌రాల ప్ర‌కారం.. "EQ ఆఫ్ M: 5.3, ఆన్: 04/12/2024 07:27:02 IST, చివరి: 18.44 N, పొడవు: 80.24 E, లోతు: 40 కి.మీ, స్థానం: ములుగు, తెలంగాణ.ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, చర్ల, చింతకాని, నాగులవంచ, మణుగూరు, భద్రాచ...
Charlapalli railway station | ఎయిర్ పోర్ట్ ను తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్.. ఈ రైళ్లు ఇక్కడి నుంచే..
Trending News

Charlapalli railway station | ఎయిర్ పోర్ట్ ను తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్.. ఈ రైళ్లు ఇక్కడి నుంచే..

Charlapalli railway station | ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్‌  కొత్త శాటిలైట్ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) శనివారం దీనిని ప్రారంభించనున్నారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా చర్లపల్లిరైల్వేష్టేషన్ అవతరించబోతోంది.ఈ కొత్త టెర్మినల్‌ ప్రారంభమయ్యాక హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌, ‌కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గనుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రూ. 428 కోట్లతో ఈ స్టేషన్‌ను హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. ఐదు లిఫ్టులు, ఐదు ఎస్కులేటర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు ఉన్నాయి. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా భవనం, అత్యంత ఆకర్షణీయంగా ముఖ్య ద్వారం నిర్మించారు. ఈ స్టేషన్‌ ‌భవనంలో గ్రౌండ్‌ ‌ఫ్లోర్ లో ఆరు టికెట్‌ ‌బుకింగ్‌ ‌కౌంటర్లు, మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా ...
HYD Metro | రెండో దశ మెట్రో ప్రాజెక్టు డీపీఅర్ సిద్ధం!
Telangana

HYD Metro | రెండో దశ మెట్రో ప్రాజెక్టు డీపీఅర్ సిద్ధం!

HYD Metro | హైదరాబాద్‌ మెట్రో రైల్‌ రెండో దశ పనులకు రాష్ట్ర ప్ర‌భుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన ప‌నుల‌ను ఆరు కారిడార్లుగా విభజించగా.. ఐదు కారిడార్లకు డీపీఆర్‌లు రెడీ అయ్యాయ‌ని మెట్రోరైల్ ఎండి ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ - ప్రైవేట్‌ భాగస్వామ్యంతో మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ విస్తరణకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, దేశంలోనే మూడో అతి పెద్ద మెట్రో నెట్ వ‌ర్క్ గా హైదరాబాద్‌ మెట్రో అవతరిస్తుందని ఆయ‌న తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్‌ మెట్రో రైలు స‌క్సెస్ ఫుల్‌గా నడుస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంద‌ని, ప్రపంచంలోనే ఏడేళ్లు పూర్తి చేసుకున్న అతి పెద్ద మెట్రో రైలు ప్రాజెక్ట్‌గా అరుదైన ఘ‌న‌త‌ను సంపాదించుకుందని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.ముం...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ నోటిఫికేషన్
Telangana

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ నోటిఫికేషన్

Land acquisition For Elevated Corridor : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో రెండు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించేందుకు అవసరమైన భూమిని అధికారికంగా సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణంలో భూసేకరణ అనేది అత్యంత కీలకమైన అంశం. రాష్ట్ర రహదారి 1 (రాజీవ్ రహదారి)పై జింఖానా గ్రౌండ్ నుంచి శామీర్‌పేట సమీపంలోని ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు, జాతీయ రహదారి 44లో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ వరకు ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.హైదరాబాద్ కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశమైన కలెక్టర్ అనుదీప్.. భూ సేకరణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 'స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్' (ఎస్‌ఆర్‌డిపి) కింద సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌లను 2027 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప...
Etela Rajender | ఎక్కడికి రావాలో చెప్పండి..  రేవంత్ రెడ్డి సవాల్‌కు ఈటల సై
Telangana

Etela Rajender | ఎక్కడికి రావాలో చెప్పండి.. రేవంత్ రెడ్డి సవాల్‌కు ఈటల సై

Etela Rajender Fires on CM Revanth Reddy | హామీల చర్చపై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నానని బిజెపి నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.  హామీల అమలుపై చర్చకు ప్రధాని మోదీ అవసరంలేదని, ఎక్కడికి రావాలో చెబితే వచ్చేందుకు తాము సిద్ధమని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు మాత్రమే కాకుండా.. 420 హామీలపై చర్చిద్దామని ప్రతిసవాల్ విసిరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో జ‌రిగిన ప్రెస్ మీట్ లో ఈటల రాజేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది ప్రజాపాలన  వేడుకలపై ప్రజలు నవ్వుకుంటున్నారని, మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటున్నారని ఎంపీ ఈట‌ల అన్నారు.ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేశారు. ఆ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఫార్మా సిటీ (Pharma city ) రద్దు చేసి...
Cherlapalli railway station | ప్రారంభానికి సిద్ధమైన చర్లపల్లి స్టేషన్.. ఇక్కడి నుంచి నడిచే ఎక్స్ ప్రెస్ రైళ్ల లిస్టు ఇదే..
Telangana

Cherlapalli railway station | ప్రారంభానికి సిద్ధమైన చర్లపల్లి స్టేషన్.. ఇక్కడి నుంచి నడిచే ఎక్స్ ప్రెస్ రైళ్ల లిస్టు ఇదే..

Cherlapalli railway station : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరికొద్ది రోజుల్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. పనులన్నీ పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఈమేరకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సోమవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. మినిష్టర్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ (MP Eetala Rajendar), మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టి.శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, టీజీఐఐసీ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ విష్ణువర్దన్ రెడ్డి, రైల్వే కన్ స్ట్రక్షన్ సీఈ సుబ్రమణ్యం, రైల్వే సీనియర్ డెన్ కోఅర్డినేషన్ రామారావు, కీసర ఆర్డీఓ పులి సైదులు, కాప్రా డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో రైల్వే స్టేషన్ కు అవసరమైన భూములు ఇచ్చేందుకు గాను టీజీఐఐసీ,...
Telangana | పేద‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ మ‌రికొద్ది రోజుల్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక‌
Telangana

Telangana | పేద‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ మ‌రికొద్ది రోజుల్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక‌

Indiramma Housing Scheme | సొంతింటి కోసం ఎదురుచూస్తున్న‌ నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. మ‌రికొద్ది రోజుట్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ 15 రోజుల్లో గ్రామ క‌మిటీల ద్వారా ల‌బ్ధిదారుల‌ ఎంపిక పూర్తి చేయ‌నున్నారు. గ్రామాల్లో ఇందిర‌మ్మ క‌మిటీల ఎంపికే తుది నిర్ణ‌య‌మ‌ని, ఇండ్లు కూడా మ‌హిళ‌ల పేరిటే మంజూరు చేస్తామ‌ని గృహ‌నిర్మాణ‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి (Punguleti Srinivas Reddy) తెలిపారు. మ‌రో ముఖ్య విష‌య‌మేమిటంటే ఈసారి ల‌బ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే చాన్స్ క‌ల్పిస్తున్నారు. రాజ‌కీయ జోక్యం లేకుండా నిరుపేద‌లకు తొలి ప్రాధాన్యం ఇస్తామ‌ని మంత్రి తెలిపారు. ల‌బ్దిదారుల ఎంపిక‌లో ప్ర‌త్యేక యాప్ దే కీల‌క‌పాత్ర‌, అందుకే ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌ని వివ‌రిచారు. ఆధార్‌తో స‌హా అన్నివివరాలు కొత్త‌గా తీసుకొస్తున్న‌ యాప్ లో పొందుప‌రుస్తారు. ఎలాంటి డిజైన్లు లేవు.. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ...
TGSRTC Cargo Service | రాష్ట్ర ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇక ఇంటి వద్దకే కార్గో సేవలు..
Telangana

TGSRTC Cargo Service | రాష్ట్ర ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇక ఇంటి వద్దకే కార్గో సేవలు..

Hyderabad TGSRTC Cargo | ఇక నుంచి ఇంటి వ‌ద్ద‌కే నేరుగా కార్గో సేవ‌లను అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) సిద్ధమైంది. ఆర్టీసీ  ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను  వేగంగా విస్త‌రించేందుకు  చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్ లో  వేగ‌వంత‌మైన కార్గో సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ వెల్ల‌డించారు. రేపటి నుంచే హైద‌రాబాద్ లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని మంత్రి పొన్నం వివ‌రించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్ లో ఎక్క‌డికైనా హోం డెలివ‌రీ చేయవ‌చ్చ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ హోం డెలివ‌రీ స‌దుపాయా...
దూకుడు పెంచనున్న హైడ్రా.. తర్వాత లక్ష్యం అవే..
Telangana

దూకుడు పెంచనున్న హైడ్రా.. తర్వాత లక్ష్యం అవే..

Hydra Pilot Project :  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వచ్చే ఆరునెలల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు చెరువులను సుందరీకరణ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది.   హైడ్రా ఒకవైపు ప్రభుత్వ భూములను కాపాడుతూనే మరోవైపు చెరువులను సుందరీకరణ చేయాలని నిర్ణయించుకుంది.  హైదరాబాద్ మహానగర పరిధిలో చెరువుల పూర్వభవం కోసం  పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తోంది. తొలివిడతగా నాలుగు చెరువుల సుందరీకరణ చేయాలని అది కూడా  ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిలో  బాచుపల్లి- ఎర్రగుంట చెరువు, మాదాపూర్- సున్నం చెరువు, కూకట్‌పల్లి-నల్లచెరువు, రాజేంద్రనగర్- అప్పచెరువును హైడ్రా ఎంపిక చేసింది.హైదరాబాద్ లో  తూర్పు, దక్షిణ, ఉత్తరం, పశ్చిమ వైపులా ఒక్కో చెరువును ఎంపిక చేసుకుంది. తొలుత చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో మార్కింగ్ పూర్తి చేయనుంది. ఇందుకు నెలరోజుల సమయం కేటాయించనుంది. తర్వాత చెరువుల చుట్టూ ...