దట్టమైన అడవి మీదుగా శ్రీశైల మల్లన్నకు.. హైదరాబాద్ – శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై ఓవర్!
Elevated Corridor Srisailam : ప్రసిద్ధ శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్డు మార్గంలో పెద్ద పెద్ద కొండలు, ప్రమాదకరమైన మలుపులు దాడుకుని వెళ్లడం ఎంతో కష్టంగా ఉండేది. హైదరాబాద్ దాటగానే చుట్టూ దట్టమైన నల్లమల అడవిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాదకరమైన మలుపుల మధ్య వాహనాల వేగం మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్లు దాటడానికి వీలు లేదు. ఒకవేళ వాహన వేగం పెరిగితే జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి. పైగా రాత్రివేళల్లో ప్రయాణం పూర్తిగా నిషేధం. మరోవైపు దట్టమైన కీకారణ్యం మధ్య సొంత వాహనాల్లో వెళ్లాలంటే వన్యప్రాణుల భయం కూడా ఉంది. ఇలాంటి సమస్యల నుంచి భక్తులకు విముక్తి కల్పించేందుకు తెలంగాణ సర్కారు కొత్త ప్రతిపాదన చేసింది. 55 కిలోమీటర్ల పొడవైన భారీ వంతెన (Elevated Corridor Srisailam Highway) ను నిర...