కర్ణాటకలోశాంతిభద్రతలపై దేశం ఆందోళన చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ
Hubballi murder case | హుబ్బళ్లి హత్య ఘటనపై సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై యావత్ దేశం ఆందోళన చెందుతోందని, రాష్ట్రాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుందని అన్నారు. ఉత్తర కన్నడలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఒక కుమార్తెకు ఏమైందోనని యావత్ దేశం ఆందోళన చెందుతోంది. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై వారు ఆందోళన చెందుతున్నారు. తమ కుమార్తెల ఏమవుతారోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను నాశనం చేసే పనిలో నిమగ్నమై ఉంది. నేరాలను నియంత్రించే బదులు, కాంగ్రెస్ వ్యతిరేక, దేశ వ్యతిరేక ఆలోచనా ధోరణిని ప్రోత్సహిస్తోంది" అని ప్రధాని అన్నారు.
హుబ్బళ్లి-ధార్వాడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కౌన్సిలర్ నిరంజన్ హిరేమఠ్ కుమార్తె నేహా(23) ఏప్రిల్ 18న బీవీబీ కాల...