Hindu population : 1950 నుంచి 2015 వరకు భారత్ లో భారీగా తగ్గిన హిందువుల జనాభా..
Hindu population : భారతదేశంలో మెజారిటీ మతం (హిందువులు) జనాభా వాటా 1950 నుంచి 2015 మధ్య భారీగా 7.8 శాతం తగ్గింది. అదే సమయంలో ముస్లింల సంఖ్య 43.15 శాతం పెరిగింది. ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ పేపర్ (EAC-PM) ప్రకారం.. మెజారిటీ జనాభాలో తగ్గుదల నేపాల్ తోపాటు మయన్మార్‌లలో కూడా కనిపించింది. అయితే 38 ఇస్లామిక్ దేశాల్లో ముస్లింల జనాభా గణనీయంగా పెరిగింది. తాజా అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని పార్సీలు, జైనులు మినహా, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులతో సహా అన్ని ఇతర మతపరమైన మైనారిటీల నిష్పత్తి వారి జనాభా వాటాలో పెరుగుదల కనిపించింది. ఈ కాలంలో 6.58 శాతానికి చేరుకుంది.
భారత్ లో హిందూ జనాభా తగ్గుదల
EAC-PM అధ్యయనం ప్రకారం, భారతదేశంలో, మెజారిటీ హిందూ జనాభా వాటా 1950 - 2015 మధ్య 7.82 శాతం తగ్గింది (84.68 శాతం నుంచి 78.06 శాతానికి). 1950లో ముస్లిం జనాభా వాటా 9.84 శాతం కాగా, 2015లో 14.09 శాతాన...