
HMPV Vrius | దేశంలోకి ప్రవేశించిన HMPV వైరస్
HMPV virus Alert : బెంగళూరులోని ఎనిమిది నెలల శిశువుకు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది చైనాలో ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలకు కారణమైన వైరస్ ను భారతదేశంలో మొదటిసారిగా గుర్తించారు.చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, కర్నాటక ఆరోగ్య అధికారులు ఈ శ్వాసకోశ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను ప్రభావితం చేస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, శ్వాసకోశ పరిశుభ్రతను పాటించడం, సబ్బు, నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వంటి చర్యలు చేపట్టాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. టవల్, చేతి రుమాళ్ల వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో షేర్ చేసుకోవద్దు. ప్రజలు హైడ్రేటెడ్‌గా ఉండాలని, పౌష్టికాహారం తినాలని, వై...