
Karimnagar Hasanparthy Railwayline | గుడ్ న్యూస్.. కరీంనగర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ పై కీలక అప్ డేట్..
Karimnagar Hasanparthy Railwayline : ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న కరీంనగర్ - హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తాజాగా కరీంనగర్ నుంచి హసన్ పర్తి వరకు చేపట్టే రైల్వేలైన్ నిర్మాణ పనులపై కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండలంలోని తాడికల్, మక్త, మొలంగూర్, లింగాపూర్ గ్రామాల మీదుగా రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది. పలు ప్రాంతాలలో యంత్రాల సాయంతో మట్టి తవ్వకాలు చేశారు. మట్టి దృఢత్వం, రాళ్లు, నేల పరిస్థితిని అంచనా వేసేందుకు నమూనాలు సేకరిస్తున్నారు.కాగా కరీంనగర్(Karim nagar) ¬- హసన్ పర్తి (Hasanparthi) రైల్వే లైన్ ప్రాజెక్ట్ అమలు వ్యయం సుమారు రూ. 1,116 కోట్లు. ఈ రైలు మార్గం పూర్తయితే.. మానకొండూర్, శంకరపట్నం, హుజూరాబాద్ (Huzurabad) వాసులకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. అలాగే విజయవాడ, చెన్నై, తిర...