PM Modi : కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే: ప్రధాని మోదీ
PM Modi : జైపూర్ : కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ (PM Modi) పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రజల సంపదను లాక్కొని "ఎంపిక చేసిన" వ్యక్తులకు పంచడానికి భారీ కుట్ర పన్నుతున్నారని మరోసారి ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) వినడం కూడా నేరంగా మారుతుందని మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం హనుమాన్ జయంతిని జరుపుకుంటున్న రోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రీరామనవమి వేడుకలను కూడా నిషేధించిందని పేర్కొన్నారు. రాజస్ధాన్‌లో మొదటిసారి ఈసారి రామనవమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారని ఆయన తెలిపారు. ప్రజలు రామ శబ్ధాన్ని ఆలపించే రాజస్దాన్ వంటి రాష్ట్రంలో కాంగ్రెస్ రామనవమిని నిషేధించడమేంటని ప్రశ్నించారు.రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఆదివారం జరిగిన ర్యాలీలో తాను చేసిన ‘సంపద పునఃపంపిణీ’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్, విపక...