
SIR : రెండవ దశ ఓటర్ల జాబితా సవరణ ప్రారంభం — 12 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండవ దశ SIR (Special Intensive Revision) ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో 277 లోక్‌సభ నియోజకవర్గాలు, 1,843 అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్ చేయనున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో దాదాపు 51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు.సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో (UTలు) రెండవ దశ SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) నిర్వహించనున్నట్లు వివరించారు. SIR నిర్వహించబడే రాష్ట్రాల్లో, ఈరోజు అర్ధరాత్రి ఓటర్ల జాబితాలను స్తంభింపజేస్తామని, తరువాత అన్ని వివరాలతో కూడిన ప్రత్యేకమైన గణన ఫారమ్‌లను ఇస్తామని CEC కుమార్ తెలిపారు."SIR అర్హత కలిగిన ఏ ఓటర్లను వదిలిపెట్టకుండా, అనర్హులైన ఓటర్లను పోల్ జాబితాలో చేర్చకుండా చూస్తుంది" అని అన్నారు. సెప్టెంబ...
