Gurukulam Admissions : విద్యార్థులకు అలర్ట్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్..
దరఖాస్తుకు ఏప్రిల్ 12వరకు గడువు...
ఏప్రిల్ 28న పరీక్షGurukulam Admissions |హైదరాబాద్: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు టీఎస్ఆర్డీసీ సెట్-2024ను ఏప్రిల్ 28న నిర్వహించనున్నట్టు ఆయా విద్యాసంస్థలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు ఏప్రిల్ 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యా ర్థులు ఈ పరీక్షకు అర్హులని అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 21 నుంచి వెబ్ సైటులో అందుబాటులో ఉంటాయని తెలిపారు, దరఖాస్తు సహా ఇతర పూర్తి వివరాలకు వెబ్ సైటు ను సందర్శించాలని సూచించారు.గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశం (Gurukulam Admissions) పొందిన విద్యార్థులకు పూర్తి ఉచి...