గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. వివరాలు ఇదిగో..
Telangana Group 2 Exam Date : తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్ష తేదీలను బుధవారం గ్రూప్ పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ప్రకటిచింది. ఆగస్టు 7, 8వ తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న జరగనుంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 న ప్రారంభమవుతాయి.
వయోపరిమితి పెంపు
తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతున్నా, ఒక్కసారి కూడా గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయలేదు. గత నోటిఫికేషన్ ను రద్దు చేసి, మొత్తం 563 పోస్టుల భర్తీకీ టీఎస్పీఎస్సీ ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసినవారు గ్రూప్ -1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గత నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు తాజా నోటిఫికేషన్ కు ఎలాంటి ఫీజు కూ...