
అస్సాంలో కల్లోలం సృష్టిస్తున్న వరదలు
నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు
కొట్టుకుపోయిన వంతెనలు, పంటపొలాలు
గౌహతి: Assam Floods అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 37,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. అసోమ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వివరాల ప్రకారం.. 13 జిల్లాల్లోని 146 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. అస్సాంలోని బిస్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగర్, హోజై, లఖింపూర్, నాగావ్, సోనిత్‌పూర్, తిన్‌సుకియా, ఉదల్‌గురి, కాచర్, కమ్రూప్ (మెట్రో) నల్బారి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.వరదలు కారణంగా రహదారులు, వంతెనలు తెగిపోయాయి. 1,409 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పంట పొలాలు తుచుకుపెట్టుకుపోయాయి. బ్రహ్మపుత్ర, పుతిమరి, కోపిలి సహా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.అధికారులు బిస్వనాథ్, దిబ్రూఘర్, లఖింపూర్, టిన్సుకియా, ఉదల్గురి ప్రాంతాల్లో 19 సహాయ శిబి...