
హైవోల్టేజ్ డ్రామా: ప్రియుడితో గొడవ పడి 80 అడుగుల విద్యుత్ టవర్ ఎక్కిన యువతి
ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓయువతి తన ప్రియుడితో తలెత్తిన గొడవ కారణంగా కలత చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ఏకంగా 80 అడుగుల హైవో్ల్టేజ్ ట్రాన్స్మిషన్ టవర్ ను ఎక్కింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా
మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెల పెండ్రా మార్వాహి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆమెను రక్షించేందుకు ప్రియుడు కూడా టవర్ ఎక్కడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.కొంతమంది స్థానికులు టవర్ పైన వీరిద్దరిని గమనించి వెంటనే పెండ్రా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఇరు కుటుంబాలకు డా సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సమయానికి టవర్ చుట్టూ పెద్ద ఎత్తున గ్రామస్తులు గుమిగూడారు.పోలీసు అధికారులు ఆ జంటతో చాలాసేపు చర్చలు జరిపి, వారిని కిందికి దిగేలా ఒప్పించారు. గంటల తరబడి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. అక్కడ గుం...