Annamalai | ‘అప్పటి వరకు చెప్పులు వేసుకోను.’: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై
Annamalai | తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే (DMK) ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ తాను చెప్పులు వేసుకోబోనని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా యూనివర్సిటీ(Anna University)లో లైంగిక దాడి కేసులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతీ శుక్రవారం తన ఇంటి ముందు ఆరు కొరడా దెబ్బలు తింటానని గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో బాధితురాలి పేరు, ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలు వెల్లడించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎఫ్ఐఆర్ లీక్ చేయడం ద్వారా బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశారని, ఇది బాధితురాలి పట్ల ప్రభుత్వం, పోలీసుల వైఖరి ఎంటో తేటతెల్లం చేస్తుందని తెలిపారు . ఎఫ్ఐఆర్ వివరాలను లీక్ చేసినందుకు పోలీసులు, డీఎంకే పార్టీ నేతలు సిగ్గు పడాలి. నిర్భయ నిధి ఎక్కడ?. అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎందుకు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయలేదు’ అని అన్నామలై (Annamalai) ప్రశ్నల...