Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Finance Ministry Of India

Budget 2024: అంగన్ వాడీ, ఆశాకార్యకర్తలకు గుడ్ న్యూస్.. మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు..
National

Budget 2024: అంగన్ వాడీ, ఆశాకార్యకర్తలకు గుడ్ న్యూస్.. మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు..

Budget 2024 Highlights: ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman). ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ..   ఆయుష్మాన్ భారత్ పథకంలో (Ayushman Bharat-Pradhan Mantri Jan Arogya Yojana) వీరిని అర్హులుగా ప‌రిగ‌ణిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే... ఇందుకు ఎంత బడ్జెట్ ప్రవేశపెడుతోన్న‌ది వెల్లడించలేదు. గత బడ్జెట్‌లో ఈ ప‌థ‌కానికి రూ.7,200 కోట్లు కేటాయించారు. మొత్తంగా కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కింద రూ.88,956 కోట్లు కేటాయించారు. ఆయుష్మాన్ భారత్‌ పథకం కింద అర్హుల‌కు రూ.5 లక్షల వ‌ర‌కు ఆరోగ్య బీమా అందిస్తారు. అలాగే ఈ కార్డ్ ద్వారా అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు, ఆశాకార్య‌క‌ర్త‌లు వైద్యం చేయించుకునేందుకు వెసులుబాటు ఉంది. పైగా ఇది న‌గ‌దు ర‌హిత సేవ‌. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 30.6 కోట్ల కుటుంబాలకు లబ్ధి జరుగుతో...