Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఏది ఫాస్ట్ గా వెళుతుందో తెలుసా..
Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భారతీయ రైల్వేలను విప్లవాత్మకంగా మార్చింది, వేగం, సౌకర్యం, భద్రతతో కూడిన ఈ ప్రీమియం రైళ్లు కొద్ది రోజుల్లోనే ప్రయాణికుల ఆదరణను చూరగొన్నాయి. ప్రజలు ఆధునిక సౌకర్యాలు, సమయపాలన, వేగం పరంగా భారతీయ రైల్వేలో ఏ రైళ్లు ఉత్తమమో దానికే మొగ్గుచూపుతుంటారు. ఇండియన్ రైల్వేస్ (Indian Railways) కూడా విభిన్నమైన ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా సరికొత్త రైళ్లను తరచూ ప్రవేశపెడుతోంది స్టేషన్లలో కూడా మౌలిక వసతులను కల్పిస్తోంది .ఇది బహుశా భారతీయ రైళ్లకు స్వర్ణ యుగంగా చెప్పవచ్చు. ఆర్థిక వృద్ధికి, ప్రాంతీయ అభివృద్ధికి ప్రీమియం రైళ్ల విస్తరణతో దేశమంతటా కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vandebhaarath Express) సిరీస్ రైళ్లు.. మిగతా హైస్పీడ్ రైళ్ల సర్వీసుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ర...