వినూత్న ఫీచర్లతో ప్రీమియం JioPhone Prima 2
JioPhone Prima 2 | స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయలేని దిగువ మధ్యతరగతి వినియోగారుల కోసం రిలయన్స్ తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీమియం మొబైల్ ఎక్స్ ప్రీరియన్స్ ఇచ్చే కొత్త స్మార్ట్ ఫీచర్ ఫోన్ JioPhone Prima 2 ను విడుదల చేసింది. దాని సొగసైన, కర్వ్ డిజైన్ తో ప్రైమా 2 సాంప్రదాయ ఫీచర్ ఫోన్‌కు భిన్నంగా కనిపిస్తుంది. వీడియో కాలింగ్ సపోర్ట్‌తో కూడిన జియో ఫోన్ ప్రైమా 2 అదనపు యాప్‌లు లేకుండా ముఖాముఖిగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.ఇది JioTV, JioSaavn, JioNews మరియు JioCinema వంటి Jio యాప్‌లతో పాటు YouTube, Facebook, Google వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రముఖ సర్వీస్‌ను అందిస్తుంది. ఈ డివైజ్ JioPay ద్వారా UPI చెల్లింపులను చేయవచ్చు. JioChat ద్వారా గ్రూప్ చాట్, వాయిస్ మెసేజింగ్, మీడియా షేరింగ్‌ను అందిస్తుంది.
స్మార్ట్ ఫీచర్లు
Prima 2 ఫీచర్ ఫోన్ KaiOSలో రన్ అవుతోంది. Qual...