EPFO Joint Declaration: EPFO జాయింట్ డిక్లరేషన్: ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలో చూడండి
EPFO Joint Declaration: EPFO జాయింట్ డిక్లరేషన్ జాయింట్ డిక్లరేషన్ ఫారమ్ (JDF) అనేది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) పొందుతున్న ఉద్యోగులకు ఒక ముఖ్యమైన పత్రం. ఇది ఉద్యోగి PF ఖాతాలో పొరపాటున తప్పుగా నమోదయిన సమాచారాన్ని అప్డేట్ చేయడానికి, లేదా సరిదిద్దడానికి ఉద్యోగి, యజమాని సంతకం చేసి ప్రాంతీయ PF కమీషనర్‌కు సమర్పించాల్సిన ఉమ్మడి ఫారమ్.
జాయింట్ డిక్లరేషన్ ఫారమ్ ప్రయోజనం ఏమిటి?
EPF రికార్డులను అప్‌డేట్ చేయడంలో EPFO Joint Declaration కీలక పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఉద్యోగులు ఏదైనా తప్పులను సరిదిద్దడానికి లేదా పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ వివరాలు లేదా వారి EPF అకౌంట్ కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా సమాచారం వంటి వారి వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేయడానికి వీలు ఉంటుంది. అదనంగా, ఇది తమ ఉద్యోగుల EPF రికార్డులలో అవసరమైన సర్దుబాట్లు చేయడానికి యజమానులను అనుమతిస్తుంది. నియమాలకు అనుగుణంగా EPF ఖాతాలన...